మంగళవారం 01 డిసెంబర్ 2020
Sports - Oct 29, 2020 , 00:42:55

కోల్‌మన్‌పై రెండేండ్ల నిషేధం

కోల్‌మన్‌పై రెండేండ్ల నిషేధం

మొనాకో: పురుషుల 100 మీటర్ల ప్రపంచ చాంపియన్‌, అమెరికా స్టార్‌ స్ప్రింటర్‌ క్రిస్టియన్‌ కోల్‌మన్‌ రెండేండ్ల నిషేధానికి గురయ్యాడు. డోపింగ్‌ నియంత్రణకు సంబంధించి మూడుసార్లు నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా అతడిపై వేటు పడింది. దీంతో వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్‌కు సైతం కోల్‌మన్‌ దూరం కానున్నాడు. అతడిపై మే 2022 వరకు నిషేధం కొనసాగనుంది. 2019లో డోపింగ్‌ పరీక్ష కోసం శాంపిల్స్‌ ఇవ్వడంలో కోల్‌మన్‌ మూడుసార్లు విఫలం కావడంతో.. ఈ ఏడాది మేలోనే అతడిపై తాత్కాలిక నిషేధం పడింది.  దోహాలో జరిగిన 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్లు సహా 4x100 విభాగాల్లో విజేతగా నిలిచిన కోల్‌మన్‌.. తదుపరి ఉసేన్‌ బోల్ట్‌ అవుతాడని ప్రశంసలు పొందాడు.