శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Sports - Mar 01, 2020 , 12:37:37

పొగలు కక్కిన క్రిస్‌ లిన్‌: వీడియో

పొగలు కక్కిన క్రిస్‌ లిన్‌: వీడియో

రావల్పిండి: పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)లో ఓ విచిత్ర ఘటన జరిగింది. ఆస్ట్రేలి యా విధ్వంసక బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ లిన్‌ తల.. కాలుతున్న పెనంలా పొగలు కక్కింది. లాహో ర్‌ ఖలందర్స్‌ - పెషావర్‌ జెల్మీ మధ్య శుక్రవా రం జరిగిన మ్యాచ్‌లో కెమెరాకు చిక్కిందీ విం త. బుర్ర వేడెక్కి పొగలు కక్కుతుందని ఇంతకాలం విన్నాం.. కానీ చూడడం ఇదే తొలిసారి అంటూ ఈ వీడియో చూసిన నెటిజన్లు విచిత్రమైన కామెంట్లు చేస్తున్నారు. లాహోర్‌ తరఫున ఆడిన లిన్‌.. పేలవ బౌలింగ్‌ చేస్తున్న తన జట్టు బౌలర్లపై ఓ దశలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

ఆ సయమంలో ఫీల్డింగ్‌ చేస్తున్న అత డి తల నుంచి ఇలా పొగలు వచ్చాయి. ఇది చూసిన వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యా రు. ఇదెలా సాధ్యమైందో అర్థం కాకపోయినా వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వర్షం కారణంగా 12ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పెషావర్‌ 132పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో లిన్‌(15 బంతుల్లో 30) రాణించినా లాహోర్‌ 16 పరుగుల తేడాతో ఓడింది. 
logo