శుక్రవారం 04 డిసెంబర్ 2020
Sports - Oct 22, 2020 , 15:02:58

ఆ టీ20 జట్టులో కుటుంబం ప్రమేయం లేదు: సల్మాన్‌ సోదరుడు

ఆ టీ20 జట్టులో కుటుంబం ప్రమేయం లేదు: సల్మాన్‌ సోదరుడు

బాలీవుడ్‌  స్టార్‌ హీరో  సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు, నటుడు, నిర్మాత సొహైల్‌ ఖాన్‌ లంక ప్రీమియర్‌ లీగ్‌ (ఎల్‌పీఎల్‌)లో  ఒక జట్టును కొనుగోలు చేశాడు.  ఎల్‌పీఎల్‌లో క్యాండీ టస్కర్స్‌ ఫ్రాంఛైజీని    సొహైల్‌ ఖాన్, అతని తండ్రి సలీమ్‌ ఖాన్‌కు చెందిన  కన్సార్షియం  ‘సొహైల్‌ ఖాన్‌ ఇంటర్నేషనల్‌ ఎల్‌ఎల్‌ఓ’  సొంతం చేసుకుంది. నవంబర్‌ 21న ఆరంభంకానున్న లీగ్‌లో క్యాండీ ఫ్రాంఛైజీలో సోహైల్‌ పెట్టుబడులు  పెట్టాడు.  టస్కర్స్‌ ఫ్రాంఛైజీలో క్రిస్‌గేల్‌, లియామ్‌ ప్లంకెట్‌, వాహబ్‌ రియాజ్‌, కుశాల్‌ పెరీరా,  కుశాల్‌ మెండీస్‌, నువాన్‌ ప్రదీప్‌ వంటి ఆటగాళ్లు ఇందులో ఉన్నారు. శ్రీలంక మాజీ కెప్టెన్‌ హషన్‌ తిలకరత్నె   కోచింగ్‌ బృందంలో ఉన్నాడు. 

ప్రొఫెషనల్‌ టీ20 క్రికెట్‌ లీగ్‌లో ఫ్రాంఛైజీ క్రికెట్‌ జట్టును కొనుగోలు చేసిన ఐదో బాలీవుడ్‌ నటుడు సొహైల్‌ ఖాన్‌.  షారుఖ్‌ ఖాన్‌(కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌), శిల్పా శెట్టి(రాజస్థాన్‌ రాయల్స్‌),  జూహీ చావ్లా(కోల్‌కతా నైట్‌రైడర్స్‌), ప్రీతీ జింటా(కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌) ఇప్పటికే క్రికెట్‌ ఫ్రాంఛైజీలకు కలిగి ఉన్నారు. 

'ఎల్‌పీఎల్‌లో ఓ టీ20 జట్టుకు యజమానికిగా  వ్యవహరిస్తున్న విషయాన్ని ధ్రువీకరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీడియాలో కొంతమంది తప్పుగా రాస్తున్నారు.   నా వ్యక్తిగత సామర్థ్యంతోనే లీగ్‌ను కొనుగోలు చేశాను. లీగ్‌లో లేదా జట్టులో నా కుటుంబం  ప్రమేయం లేదని' సొహైల్‌ ట్వీట్‌ చేశాడు.