Caribbean Premier League (CPL): హీరో కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో వెస్టిండీస్ హార్డ్‌హిట్టర్ క్రిస్‌గేల్, బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్, సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్ డుప్లెసిస్ తదితర స్టార్ ప్లేయర్లు ఆడనున్నారు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్‌లో ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 19 వరకు లీగ్ జరగనుంది. 2017, 2018 సీజన్లలో సెయింట్‌కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన క్రిస్‌గేల్ మళ్లీ టీమ్ తరఫున బరిలో దిగనున్నాడు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో మొత్తం 33 మ్యాచ్‌లు కూడా సెయింట్ కిట్స్‌లోని వార్నర్ పార్క్‌లో జరుగుతాయి. గతేడాది టోర్నీ మొత్తాన్ని ట్రినిడాడ్ అండ్ టొబాగోలో నిర్వహించారు. క్వీన్స్ పార్క్ ఓవల్, బ్రియాన్ లారా స్టేడియాల్లో ఈ మ్యాచ్‌లు జరిగాయి.