సోమవారం 23 నవంబర్ 2020
Sports - Oct 14, 2020 , 00:33:14

కోలుకున్న క్రిస్‌ గేల్‌

కోలుకున్న క్రిస్‌ గేల్‌

దుబాయ్‌: కింగ్స్‌ఎలెవన్‌ పంజాబ్‌ హార్డ్‌ హిట్టర్‌ క్రిస్‌ గేల్‌ అనారోగ్య సమస్య నుంచి కోలుకున్నాడు. కలుషిత ఆహారంతో దవాఖాన పాలైన గేల్‌ గురువారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ)తో కీలక మ్యాచ్‌లో ఆడే అవకాశముందని జట్టు వర్గాలు మంగళవారం పేర్కొన్నాయి. నెట్స్‌లో గేల్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలను పంజాబ్‌ యాజమాన్యం సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. వాస్తవానికి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో గేల్‌ ఆడాల్సి ఉన్నా..అనారోగ్యం కారణంగా దూరమయ్యాడు. హైదరాబాద్‌తో పాటు కోల్‌కతాతో మ్యాచ్‌కు ఈ యూనివర్సల్‌ బాస్‌అందుబాటులో లేకుండా  పోయా డు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడని గేల్‌..షార్జాలో ఆర్‌సీబీతో మ్యాచ్‌లో ఎలా రాణిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.