ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Sep 20, 2020 , 15:48:33

యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌గేల్‌ ఇంకో 16 పరుగులు చేస్తే..

యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌గేల్‌ ఇంకో 16 పరుగులు చేస్తే..

దుబాయ్‌: ఐపీఎల్‌ 13వ సీజన్‌ రెండో మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఆదివారం  రాత్రి జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి సీజన్‌ను ఘనంగా ఆరంభించాలని పట్టుదలతో ఉన్నాయి.  పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హార్డ్‌హిట్టింగ్‌ వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌గేల్‌ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు.

ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 125 మ్యాచ్‌ల్లో 4,484 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 4,500 పరుగుల మార్క్‌ను అధిగమించడానికి గేల్‌ ఇంకో 16 పరుగులు చేయాల్సి ఉంది. ఢిల్లీతో పోరులో గేల్‌ 16 రన్స్‌ చేస్తే..డేవిడ్‌ వార్నర్‌ తర్వాత ఈ మార్క్‌ అందుకున్న రెండో విదేశీ ఆటగాడిగా నిలువనున్నాడు. ఓవరాల్‌గా మైలురాయిని అందుకున్న ఆరో బ్యాట్స్‌మన్‌గా క్రిస్‌గేల్‌కు జాబితాలో చోటు దక్కుతుంది. 

ఐపీఎల్‌లో పరుగుల వీరుల జాబితా..!

విరాట్‌ కోహ్లీ(5,412 రన్స్‌)

సురేశ్‌ రైనా(5,368)

రోహిత్‌ శర్మ(4,898)

డేవిడ్‌ వార్నర్‌4,706)

శిఖర్‌ ధావన్‌(4,5679)