గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Aug 26, 2020 , 00:11:05

ఊపిరి పీల్చుకున్న గేల్‌

ఊపిరి పీల్చుకున్న గేల్‌

న్యూఢిల్లీ: వెస్టిండీస్‌ విధ్వంసక వీరుడు క్రిస్‌ గేల్‌ కరోనా వైరస్‌ భయం నుంచి బయటపడ్డాడు. ఈ నెల 21న దిగ్గజ స్ప్రింటర్‌, ఎనిమిదిసార్లు ఒలింపిక్‌ చాంపియన్‌ ఉసేన్‌ బోల్ట్‌ పుట్టిన రోజు వేడుకలకు గేల్‌ హాజరయ్యాడు. అయితే బోల్ట్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో గేల్‌ పరీక్షలు చేయించుకున్నాడు. రెండు టెస్టుల్లో నెగిటివ్‌ రావడంతో ఊపిరిపీల్చుకున్నాడు. దీంతో ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ తరఫున ఆడనున్న గేల్‌ యూఏఈకి బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు. కాగా బోల్ట్‌ పుట్టిన రోజు వేడుకల్లో ఎవరూ మాస్కులు పెట్టుకోకుండా, భౌతిక దూరం పాటించకుండా సందడి చేశారు.   


logo