బుధవారం 08 జూలై 2020
Sports - May 10, 2020 , 18:31:45

విశ్రాంతి ఉంటే కౌంటీ క్రికెట్ మేలే

విశ్రాంతి ఉంటే కౌంటీ క్రికెట్ మేలే

బుమ్రాకు వ‌సీం అక్ర‌మ్ స‌ల‌హా

న్యూఢిల్లీ:  కౌంటీ క్రికెట్ ఆడితే ఎంతో నేర్చుకోవ‌చ్చు అని పాకిస్థాన్ మాజీ పేస‌ర్ వ‌సీం అక్ర‌మ్ పేర్కొన్నాడు. అయితే ప్ర‌స్తుత త‌రుణంలో బిజీ షెడ్యూల్ కార‌ణంగా కౌంటీలు ఆడ‌టం క‌ష్ట‌మైపోయింద‌ని..  అదే ఒక‌ప్ప‌టి త‌రంలో అయితే ఏడాదిలో స‌గం రోజులు కౌంటీల‌కే కేటాయించేవాళ్ల‌మ‌ని అక్ర‌మ్ అన్నాడు. టీమ్ఇండియా నంబ‌ర్‌వ‌న్ బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రాకు త‌గినంత స‌మ‌యం ల‌భిస్తే.. కౌంటీలు ఆడ‌టం మంచిదే అని అక్ర‌మ్ అన్నాడు.

`భార‌త జ‌ట్టు షెడ్యూల్ బిజీ బిజీగా ఉంటుంది. ఆట‌గాళ్ల‌కు విరామం ల‌భించ‌డం చాలా అరుదు. మా కాలంలో చాలా స‌మ‌యం ఉండేది. నా విష‌యానికొస్తే.. ఆరు నెల‌లు పాకిస్థాన్ త‌ర‌ఫున, ఆరు నెల‌లు కౌంటీ జ‌ట్టు త‌ర‌ఫున ఆడే వాడిని. కౌంటీల వ‌ల్ల ఎంతో నేర్చుకున్నా. ప్ర‌స్తుత త‌రానికి ఆ వెసులుబాటు లేదు. ముఖ్యంగా బుమ్రా వంటి ఆట‌గాడు కౌంటీల నుంచి నేర్చుకునే చాన్స్‌లు ఉన్నాకానీ.. తీరిక లేని షెడ్యూల్ కార‌ణంగా అది సాధ్య‌ప‌డ‌క‌పోవ‌చ్చు. అప్పుడో ఇప్పుడో ల‌భించే విరామంలో శ‌రీరానికి కాస్త రెస్ట్ ఇవ్వ‌డ‌మే మంచిది`అని అక్ర‌మ్ అన్నాడు.


logo