శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Mar 15, 2020 , 00:14:44

చైనీయులు చేయవట్టే

చైనీయులు చేయవట్టే

ఇస్లామాబాద్‌: కరోనా వైరస్‌కు కారణమైన చైనీయులపై పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ప్రపంచాన్ని మీరంతా ప్రమాదంలోకి నెట్టివేసారంటూ అక్తర్‌ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. గత డిసెంబర్‌లో చైనాలోని వుహాన్‌ నగరంలో మొదలైన కరోనా వైరస్‌ అంతకంతకు వ్యాప్తిచెందుతూ ప్రపంచాన్ని కుదిపివేస్తున్నది. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ ‘అసలు మీరు(చైనీయులు) గబ్బిలాలు, పాము లు, కప్పలు, కుక్కలు, పిల్లులు ఎందుకు తింటున్నారో నాకు అర్థం కావడం లేదు. వాటి రక్తం, మూత్రంతో మీరు వైరస్‌ను పుట్టించి ప్రపంచాన్ని ఇబ్బందుల్లోకి నెట్టారు. వైరస్‌తో టూరిజం పరిశ్రమ పడిపోవడంతో పాటు ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతింది’ అని అక్తర్‌ అన్నాడు. logo