మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 28, 2020 , 19:26:11

ఒలింపిక్‌ ఛాంపియన్‌పై 8ఏండ్ల నిషేధం

ఒలింపిక్‌ ఛాంపియన్‌పై 8ఏండ్ల నిషేధం

జెనీవా:  డోపింగ్‌ కేసులో చైనీస్‌ దిగ్గజ స్విమ్మర్‌, మూడు సార్లు ఒలింపిక్‌ ఛాంపియన్‌ సన్‌  యాంగ్‌పై 8ఏండ్ల నిషేధం పడింది. దీంతో మరికొన్ని నెలల్లో జపాన్‌లో జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌-2020లో పాల్గొనే అవకాశాన్ని అతడు చేజార్చుకున్నాడు. స్విట్జర్లాండ్‌లోని సుప్రీం కోర్టులో సన్‌ అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉంది. డోపింగ్‌ నిరోధక నియమాలను ఉల్లంఘించడంతో అతడిపై చర్యలు తీసుకున్నారు.  2018 సెప్టెంబర్‌లో డోపింగ్‌ పరీక్ష సమయంలో అతడు వ్యవహరించిన తీరుపై  వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ(వాడా) ఆగ్రహం వ్యక్తం చేసింది.  

ఓ అర్ధరాత్రి జరిగిన సంఘటనలో అతడు డోపింగ్‌ నిరోధక నియమాలను ఉల్లంఘించడంతో పాటు.. రక్త నమూనా కంటైనర్‌ను సుత్తితో పగలగొట్టాడని  ఆరోపణలు వచ్చాయి. శాంపిల్స్‌ సేకరించేందుకు డోపింగ్‌ అధికారులు యాంగ్‌  ఇంటికి వెళ్లగా వాళ్లకు సహకరించడానికి నిరాకరించడంతో పాటు వాగ్వాదానికి దిగిన కేసులో కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌(సీఏఎస్‌) సన్‌ యాంగ్‌ను దోషిగా తేల్చింది. వాడా అప్పీల్‌ చేయడంతో విచారణ జరిపిన సీఏఎస్‌ ఇవాళ తుది తీర్పు వెలువరించింది.  28ఏండ్ల చైనా టాప్‌ స్మిమ్మర్‌-2012 లండన్‌, రియో డీజనీరో-2016 ఒలింపిక్స్‌లో రెండు బంగారు పతకాలను గెలుచుకున్నాడు. అంతకుముందు 2014లో డోపింగ్ ప‌రీక్ష‌లో యాంగ్ దోషిగా తేలడంతో  అత‌డు మూడు నెల‌ల నిషేధం ఎదుర్కొన్నాడు.


logo
>>>>>>