బుధవారం 12 ఆగస్టు 2020
Sports - Jul 05, 2020 , 02:45:04

డాన్‌ వీడ్కోలు

 డాన్‌ వీడ్కోలు

బ్యాడ్మింటన్‌కు చైనా దిగ్గజం లిన్‌ డాన్‌ గుడ్‌బై        

ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌.. రెండు ఒలింపిక్‌ స్వర్ణాలు    

లిన్‌ డాన్‌ ఘనతలు 

రెండు ఒలింపిక్స్‌ స్వర్ణాలు(2008 బీజింగ్‌, 2012 లండన్‌). విశ్వక్రీడల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాను నిలబెట్టుకున్న తొలి షట్లర్‌గా రికార్డు. 

ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌ స్వర్ణాలు(2006, 2007, 2009, 2011, 2013)

ఆరుసార్లు ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ విజేత

బ్యాడ్మింటన్‌లో సూపర్‌ గ్రాండ్‌స్లామ్‌(9మేజర్‌ టోర్నీలు నెగ్గడం) పూర్తి చేసిన ఒకేఒక్కడు

ఆసియా గేమ్స్‌లో ఐదు, ఆసియా చాంపియన్‌షిప్స్‌లో నాలుగు, సుదిర్మన్‌ కప్‌లో ఐదు స్వర్ణాలు సహా కెరీర్‌లో మొత్తం 66 టైటిళ్లు

బీజింగ్‌: చైనా బ్యాడ్మింటన్‌ దిగ్గజం, రెండుసార్లు ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత లిన్‌ డాన్‌ ఆటకు వీడ్కోలు పలికాడు. రెండు దశాబ్దాల సు దీర్ఘ కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టాడు. ఈ నిర్ణయా న్ని 37ఏండ్ల లిన్‌ డాన్‌ శనివారం ప్రకటించాడు. శరీరం సహకరించని కారణంగా  ఆట నుంచి ఎంతో భారమైన హృదయంతో నిష్క్రమిస్తున్నానని వెబియో అనే సోషల్‌ మీడియాలో పేర్కొన్నాడు. ‘ఇప్పుడు నేను ఆటకు వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చింది. నాకు ప్రస్తుతం 37ఏండ్లు. శారీరక పరిస్థితి, గాయాలు ఇక నేను ఆడేందుకు సహకరించడం లేదు’ అని లిన్‌ డాన్‌ చెప్పాడు. కెరీర్‌ చివర్లో డాన్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 19వ స్థానానికి పడిపోయాడు. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొని ఆటకు వీడ్కోలు పలుకుదామనుకున్నా.. అర్హత సాధించడం కష్టతరంగా మారడం, గాయాలు వేధిస్తుండడంతో వైదొలిగేందుకే లిన్‌ మొగ్గుచూపాడు. 

తాజావార్తలు


logo