శనివారం 26 సెప్టెంబర్ 2020
Sports - Aug 29, 2020 , 00:30:00

2023 ప్రపంచకప్‌లోనూ రోహిత్‌ రాణిస్తాడు: దినేశ్‌

2023 ప్రపంచకప్‌లోనూ రోహిత్‌ రాణిస్తాడు: దినేశ్‌

 ముంబై: స్వదేశం వేదికగా 2023లో జరిగే ప్రపంచకప్‌లో రోహిత్‌శర్మ అద్భుత ప్రదర్శన కనబరుస్తాడని అతని చిన్ననాటి కోచ్‌ దినేశ్‌ లాడ్‌ పేర్కొన్నాడు. గతేడాది ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో రోహిత్‌ ఐదు సెంచరీలతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. అయితే సొంతగడ్డపై పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటూ 2023లో రోహిత్‌..కచ్చితంగా భారత్‌కు ప్రపంచకప్‌ సాధించిపెడుతాడని దినేశ్‌ అభిప్రాయపడ్డాడు. శుక్రవారం దినేశ్‌ మాట్లాడుతూ ‘ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం ఖేల్త్న్ర అవార్డు రోహిత్‌కు దక్కడం సంతోషంగా ఉంది’ అని అన్నాడు. 


logo