గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Aug 01, 2020 , 23:24:51

అభిమాన ఆటగాడిగా సునీల్ ఛెత్రి

అభిమాన ఆటగాడిగా సునీల్ ఛెత్రి

న్యూఢిల్లీ : భారత ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి 2019 ఏఎఫ్సీ ఆసియా కప్ అభిమాన ఆటగాడిగా ఎన్నికయ్యాడు. ఈ విషయాన్ని ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ శనివారం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఫైనల్‌ పోటీలో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ఎల్డర్ షోమురోడోవ్‌ను 51-49 శాతం ఓట్ల తేడాతో ఛెత్రి ఓడించాడు. అభిమానుల ఫోల్ ను ఏఎఫ్‌సి నిర్వహించింది. 

“19 రోజులు.. 561,856 ఓట్లు # AsianCup2019 అభిమాన ఆటగాడు నిర్ణయించబడ్డాడు. అభినందనలు సునీల్ ఛెత్రి!” అంటూ ఏఎఫ్సీ ట్విట్టర్ లో ఫలితాన్ని ప్రకటించింది. గత సీజన్లో ఆసియా కప్ గ్రూప్ దశలో 35 ఏండ్ల ఛెత్రి రెండుసార్లు స్కోరు సాధించాడు. దీనిలో భారత్ రౌండ్ 16 స్థానాన్ని దక్కించుకుంది. ప్రారంభ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌పై గెలుపొందిన 4-1 గోల్సులో రెండు గోల్స్ ఛెత్రికి వచ్చాయి. 72 గోల్స్, 115 ప్రదర్శనలతో ఛెత్రి భారతదేశం యొక్క ఆల్-టైమ్ అత్యధిక గోల్ స్కోరర్ గానే కాకుండా అత్యధిక క్యాప్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఛెత్రిని తన 34 వ పుట్టినరోజు సందర్భంగా ఆసియా ఐకాన్ గా ఏఎఫ్సీ పేర్కొన్నది.


logo