శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Nov 20, 2020 , 00:02:31

పుజారా ప్రాక్టీస్‌

 పుజారా ప్రాక్టీస్‌

సిడ్నీ: టెస్టు స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారా ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. ఆసీస్‌తో సంప్రదాయ సిరీస్‌ కోసం సిద్ధమవుతున్న పుజారా గురువారం నెట్స్‌తో పాటు, ప్రధాన పిచ్‌పై ప్రాక్టీస్‌ చేశాడు. ఉమేశ్‌ యాదవ్‌, కార్తీక్‌ త్యాగి, ఇషాన్‌ పొరెల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ బంతులను ఎదుర్కొన్న పుజారా చక్కటి టచ్‌లో కనిపించాడు. మరోవైపు టీమ్‌ఇండియా త్రోడౌన్‌ స్పెషలిస్ట్‌ రఘు.. క్వారంటైన్‌ పూర్తిచేసుకొని జట్టుతో కలిశాడు. కరోనా పాజిటివ్‌ అని తేలడంతో సహాయ సిబ్బందితో కలిసి ఆసీస్‌ వెళ్లని రఘు కోలుకున్న అనంతరం కంగారూ గడ్డపై అడుగుపెట్టాడు.