శనివారం 06 మార్చి 2021
Sports - Feb 15, 2021 , 11:33:13

బ్యాడ్‌ల‌క్‌.. విచిత్రంగా ర‌నౌటైన పుజారా.. వీడియో

బ్యాడ్‌ల‌క్‌.. విచిత్రంగా ర‌నౌటైన పుజారా.. వీడియో

చెన్నై: ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజు ఆట‌లో టీమిండియా బ్యాట్స్‌మ‌న్ చెటేశ్వ‌ర్ పుజారా అవుటైన తీరు చాలా వింత‌గా ఉంది. మోయిన్ అలీ బౌలింగ్‌లో ముందుకు వ‌చ్చి ఆడ‌బోయిన పుజారా ప్యాడ్‌కు త‌గిలి బంతి షార్ట్ లెగ్‌లో ఉన్న ఓలీ పోప్ చేతిలో ప‌డింది. అతడు వెంట‌నే బంతిని వికెట్ కీప‌ర్‌కు విసిరాడు. ఆలోపే క్రీజులోకి వెళ్ల‌డానికి పుజారా ప్ర‌య‌త్నించినా.. అత‌ని చేతిలో నుంచి బ్యాట్ కింద ప‌డిపోయింది. త‌న కాలును క్రీజులో పెట్టేలోపే వికెట్ కీప‌ర్ ఫోక్స్‌.. వికెట్ల‌ను గిరాటేశాడు. దీంతో పుజారా నిరాశ‌గా వెనుదిర‌గాల్సి వ‌చ్చింది. 

VIDEOS

logo