ఆదివారం 12 జూలై 2020
Sports - Jun 13, 2020 , 18:25:02

ఐదుగురు భారత క్రికెటర్లకు ‘నాడా’ నోటీసులు

ఐదుగురు భారత క్రికెటర్లకు ‘నాడా’ నోటీసులు

న్యూఢిల్లీ: టీమ్ఇండియా పురుషుల జట్టు ఆటగాళ్లు చతేశ్వర్ పుజార, రవీంద్ర జడేజ, కేఎల్ రాహుల్ సహా మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, దీప్తిశర్మకు జాతీయ మాదకద్రవ్య నిరోధక సంస్థ(నాడా) నోటీసులు జారీ చేసింది. లాక్​డౌన్ కాలంలో ఎక్కడున్నారో తమకు వివరాలు ఎందుకు పంపలేదని వివరణ అడిగింది.  అయితే వివరాలు సమర్పించాల్సిన సాఫ్ట్​వేర్​ (యాంటీ డోపింగ్​ అడ్మినిస్ట్రేషన్​, మేనేజ్​మెంట్ సిస్టం) పాస్​వర్డ్​లో తలెత్తిన  సమస్యల వల్ల వారి వివరాలను అందించడంలో ఆలస్యమైందని నాడాకు బీసీసీఐ తెలిపింది.

ఎక్కడ ఉన్న వివరాలను తమకు సాఫ్ట్​వేర్ ద్వారా ప్లేయర్లు స్వయంగా సమర్పించవచ్చని లేదా అసోసియేషన్లు కూడా వారి తరఫున అందించవచ్చని నాడా డీజీ నవీన్ అగర్వాల్ తెలిపారు. అయితే క్రికెటర్లు బిజీగా ఉంటారనే కారణంగా బీసీసీఐ వారి వివరాలను సమర్పిస్తూ వస్తుందని, ఈసారి అందజేయకపోవడంతో ఆ ప్లేయర్లకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. అయితే పాస్​వర్డ్ సమస్య వచ్చిందని బీసీసీఐ తమకు వివరణ ఇచ్చిందని, ఇప్పుడు సమస్య పరిష్కారమైందని తెలిపిందని ఆయన చెప్పారు. బీసీసీఐ వివరణపై చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కాగా వివిధ క్రీడలకు చెందిన మరో 35మంది అథ్లెట్లకు కూడా నాడా నోటీసులు జారీ చేసింది. మూడుసార్లు ఇలా వివరాలు ఇవ్వనిపక్షంలో అథ్లెట్లపై గరిష్ఠంగా రెండేండ్ల వరకు నిషేధం పడుతుంది. 


logo