బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Sep 01, 2020 , 02:04:58

భవిష్యత్తు ‘బంగారం’ చెస్‌ ఒలింపియాడ్‌ స్వర్ణంపై ఆనంద్‌

భవిష్యత్తు ‘బంగారం’ చెస్‌ ఒలింపియాడ్‌ స్వర్ణంపై ఆనంద్‌

 చెన్నై: ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌లో దక్కిన స్వర్ణం భారత చెస్‌ ప్రతిష్టను మరింత పెంచిందని.. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌ విశ్వనాథ్‌ ఆనంద్‌ పేర్కొన్నాడు. ఆదివారం ఆన్‌లైన్‌లో జరిగిన ఫైనల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో భారత్‌,రష్యాను ఉమ్మడి విజేతలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆనంద్‌ మాట్లాడుతూ.. ‘ఇంటర్నెట్‌లో సమస్య తలెత్తిన సమయంలో నిహాల్‌ మెరుగైన స్థితిలో ఉన్నాడు. ఇక దివ్య అయితే విజయానికి చాలా దగ్గరకు వచ్చింది. ఇలాంటప్పుడు నిర్వాహకులు ఉమ్మడి విజేతను ప్రకటించడం మంచి నిర్ణయమే. ఈ స్వర్ణం భారత చెస్‌ ఎదుగుదలను సూచిస్తున్నది. ఇది సమిష్టి విజయం. చదరంగంలో మనకు మంచి భవిష్యత్తు ఉందనడానికి ఇది నిదర్శనం’ అని అన్నాడు. 


logo