ఆదివారం 05 జూలై 2020
Sports - Apr 21, 2020 , 17:05:57

జర్మనీలో చెస్​ దిగ్గజం విశ్వనాథన్ దినచర్య ఇదే..

జర్మనీలో చెస్​ దిగ్గజం విశ్వనాథన్ దినచర్య ఇదే..

చెన్నై: బుండేస్లిగా​ టోర్నీలో పాల్గొనేందుకు ఫిబ్రవరిలో జర్మనీ వెళ్లిన భారత చెస్ దిగ్గజం, ప్రపంచ మాజీ చాంపియన్​ విశ్వనాథన్ ఆనంద్​.. కరోనా వైరస్ ప్రభావం కారణంగా అక్కడే ఉండాల్సి వచ్చింది. ప్రయాణ ఆంక్షలు ఉండడంతో  దాదాపుగా రెండు నెలలుగా ఫ్రాంక్​ఫర్ట్​ సమీపంలో ఉంటున్న విశ్వనాథన్​ మంగళవారం పీటీఐతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులతో పాటు తన దినచర్య గురించి వివరించారు.

“జర్మనీ సౌకర్యవంతంగానే ఉంది. నేను ప్రస్తుతం చిన్న నగరంలో ఉన్నా. రోజుకు రెండుసార్లు కాసేపు బయటకు వెళ్లేందుకు అవకాశం ఉంది. భౌతిక దూరం తప్పకపాటిస్తున్నా. నిత్యావసరాలతో పాటు కావాల్సిన వస్తువుల కోసం కొంత షాపింగ్ చేస్తున్నా. ఇక్కడికి దగ్గర్లో నాకు స్నేహితులు ఉండడం పెద్ద సానుకూలంశం. కుటుంబ సభ్యులతో తరచుగా ఫోన్​, వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుతున్నా. చెస్ గురించిన మరింత సమాచారం, విశేషాల కోసం ఇంటర్నెట్​లో శోధిస్తున్నా. పాత స్నేహితులతో ఫోన్​లో మాట్లాడుతున్నా. మొత్తంగా జర్మనీలో బాగానే ఉన్నా” అని విశ్వనాధన్ ఆనంద్ చెప్పారు.

లాక్​డౌన్ కారణంగా టోర్నీలేవీ జరుగకపోవడంతో చాలా మంది ఆన్​లైన్​ చెస్​లో పోటీ పడేందుకు అలవాటు పడ్డారని విశ్వనాథన్ ఆనంద్​ అన్నారు. ఇండ్లలోనే కూర్చుకొని ఇంటర్నెట్​లో ఎక్కువ మంది చెస్​ ఆడడం బాగా అనిపిస్తున్నదని చెప్పారు. 


logo