శనివారం 31 అక్టోబర్ 2020
Sports - Sep 25, 2020 , 19:07:31

CSKvDC: టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న చెన్నై

 CSKvDC: టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న చెన్నై

దుబాయ్: ఐపీఎల్‌-2020లో శుక్రవారం మరో రసవత్తర పోరు జరుగుతోంది. అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో   చెన్నై సూపర్‌ కింగ్స్‌.. కుర్రాళ్లు, సీనియర్ల కూడిన  ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు  దుబాయ్‌ వేదికగా తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన చెన్నై సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు.

రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో ధారళంగా పరుగులు సమర్పించుకున్న లుంగీ ఎంగిడి స్థానంలో జోష్‌ హేజిల్‌వుడ్‌ను తుది జట్టులోకి తీసుకున్నాడు. మరోవైపు ఢిల్లీ జట్టులోనూ రెండు మార్పులు చేసినట్లు కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ వివరించాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో గాయపడిన స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్థానంలో అమిత్‌ మిశ్రా..పేసర్‌ మోహిత్‌ శర్మ స్థానంలో ఆవేశ్‌ ఖాన్‌ బరిలో దిగుతున్నారు.