బుధవారం 25 నవంబర్ 2020
Sports - Oct 19, 2020 , 19:06:36

CSK vs RR: బ్యాటింగ్‌ ఎంచుకున్న ధోనీ

CSK vs RR: బ్యాటింగ్‌ ఎంచుకున్న ధోనీ

అబుదాబి: ఐపీఎల్‌-13లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడుతున్నాయి. ప్లేఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ కీలకం. ఈ నేపథ్యంలో  ఈ పోరులో  ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలని రెండు జట్లు  పట్టుదలతో ఉన్నాయి. 

టాస్‌ గెలిచిన చెన్నై సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. గాయం కారణంగా డ్వేన్‌ బ్రావో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.  జోష్‌ హేజిల్‌వుడ్‌, పియూశ్‌ చావ్లాను తుది జట్టులోకి తీసుకున్నట్లు ధోనీ చెప్పాడు.  జయదేవ్‌ ఉనద్కత్‌ స్థానంలో అంకిత్‌ రాజ్‌ఫుత్‌ జట్టులోకి వచ్చినట్లు రాజస్థాన్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ వెల్లడించాడు.