ఓపెనర్లు శుభారంభాన్నిచ్చినా.. మిడిలార్డర్ విఫలమవడంతో కోహ్లీసేన సాధారణ స్కోరుకే పరిమితమైతే.. టాపార్డర్‌లో తలాకొన్ని పరుగులు చేయడంతో చెన్నై చిందేసింది. బెంగళూరుకు ఇది హ్యాట్రిక్ పరాజయం అయితే.. ధోనీ గ్యాంగ్ వరుసగా రెండో విజయంతో ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది.
షార్జా: బౌలర్ల కృషికి బ్యాటర్ల సమిష్టి ప్రదర్శన తోడవడంతో బెంగళూరుపై చెన్నై పైచేయి సాధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ను చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (70; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ విరాట్ కోహ్లీ (53; 6 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకాలు సాధించగా.. మిగిలినవాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఒక దశలో 140/1తో పటిష్ట స్థితిలో నిలిచిన కోహ్లీ సేన చివరి రెండు ఓవర్లలో ఆరు పరుగులు మాత్రమే చేయగలిగింది. డివిలియర్స్ (12), మ్యాక్స్‌వెల్ (11), డావిడ్ (1), హర్షల్ (3) భారీ షాట్లు ఆడటంలో విఫలమయ్యారు. చెన్నై బౌలర్లో బ్రావో 3, శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో చెన్నై 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (38), అంబటి రాయుడు (32), ఫాఫ్ డుప్లెసిస్ (31), మొయిన్ అలీ (23), సురేశ్ రైనా (17 నాటౌట్), మహేంద్రసింగ్ ధోనీ (11 నాటౌట్) తలా కొన్ని పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్‌కు రెండు వికెట్లు దక్కాయి. బ్రావోకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
బెంగళూరు: కోహ్లీ (సి) జడేజా (బి) బ్రేవో 53, పడిక్కల్ (సి) రాయుడు (బి) శార్దూల్ 70, డివిలియర్స్ (సి) రైనా (బి) శార్దూల్ 12, మ్యాక్స్‌వెల్ (సి) జడేజా (బి) బ్రేవో 11, డావిడ్ (సి) రైనా (బి) చాహర్ 1, హర్షల్ (సి) రైనా (బి) బ్రేవో 3, హసరంగ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 156/6. వికెట్ల పతనం: 1-111, 2-140, 3-140, 4-150, 5-154, 6-156, బౌలింగ్: దీపక్ 4-0-35-1, హజిల్‌వుడ్ 4-0-34-0, శార్దూల్ 4-0-29-2, జడేజా 4-0-31-0, బ్రేవో 4-0-24-3.
చెన్నై: గైక్వాడ్ (సి) కోహ్లీ (బి) చాహల్ 38, డుప్లెసిస్ (సి) సైనీ (బి) మ్యాక్స్‌వెల్ 31, అలీ (సి) కోహ్లీ (బి) హర్షల్ 23, రాయుడు (సి) డివిలియర్స్ (బి) హర్షల్ 32, రైనా (నాటౌట్) 17, ధోనీ (నాటౌట్) 11, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 18.1 ఓవర్లలో 157/4. వికెట్ల పతనం: 1-71, 2-71, 3-118, 4-133, బౌలింగ్: సిరాజ్ 3-0-23-0, సైనీ 2-0-25-0, హసరంగ 4-0-40-0, హర్షల్ 3.1-0-25-2, యుజ్వేంద్ర 4-0-26-1, మ్యాక్స్‌వెల్ 2-0-17-1.