మంగళవారం 27 అక్టోబర్ 2020
Sports - Sep 19, 2020 , 16:56:35

స్టేడియానికి బ‌య‌లుదేరిన ధోనీ టీమ్‌

స్టేడియానికి బ‌య‌లుదేరిన ధోనీ టీమ్‌

న్యూఢిల్లీ: ఐపీఎల్ 13వ సీజ‌న్ మ‌రికాసేప‌ట్లో ప్రారంభం కానుంది. యూఏఈలో నిర్వ‌హిస్తున్న‌ ఈ సీజ‌న్ తొలి మ్యాచ్‌లో మిస్ట‌ర్ కూల్ మ‌హేంద్ర‌సింగ్‌ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూప‌ర్‌కింగ్స్ జ‌ట్టు, హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ నేతృత్వంలోని ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ సాయంత్రం 7:30 నిమిషాల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో ధోనీ జ‌ట్టు అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియానికి బ‌స్సులో బ‌య‌లుదేరింది. కాగా, చాలా కాలం త‌ర్వాత ఐపీఎల్ జ‌రుగుతుండ‌టంతో తొలి మ్యాచ్ కోసం టీవీ ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo