శనివారం 28 నవంబర్ 2020
Sports - Oct 19, 2020 , 20:02:19

డుప్లెసిస్‌, వాట్సన్‌ ఔట్‌..కష్టాల్లో చెన్నై

 డుప్లెసిస్‌, వాట్సన్‌ ఔట్‌..కష్టాల్లో చెన్నై

అబుదాబి: రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేస్తున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్వల్ప స్కోరుకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. తొలి నాలుగు ఓవర్లకు 26/2తో కష్టాల్లో పడింది. జోఫ్రా ఆర్చర్‌ వేసిన మూడో ఓవర్‌ ఆఖరి బంతిని డుప్లెసిస్‌ భారీ షాట్‌ ఆడగా..బట్లర్‌  సూపర్బ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. కార్తీక్‌ త్యాగీ వేసిన తర్వాతి ఓవర్‌లో  రెండో బంతిని  కరన్‌ ఫోర్‌ బాదగా..నాలుగు, ఐదు బంతులను వాట్సన్‌ బౌండీలు కొట్టాడు.

ఆరో బంతిని వాట్సన్‌ ఫ్లిక్ చేయగా  షార్ట్‌ మిడ్‌వికెట్‌లో రాహుల్‌ తెవాటియాకు చిక్కాడు.  బెన్‌స్టోక్స్‌ వేసిన ఐదో ఓవర్‌లో శామ్‌ కరన్‌ భారీ  సిక్సర్‌ బాదగా.. రాయుడు రెండు ఫోర్లు కొట్టడంతో 15 పరుగులు వచ్చాయి. పవర్‌ప్లే ఆఖరికి చెన్నై రెండు వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. శామ్‌ కరన్‌(16), రాయుడు(9) క్రీజులో ఉన్నారు.