సోమవారం 30 నవంబర్ 2020
Sports - Oct 19, 2020 , 22:21:22

CSK vs RR: దూకుడు పెంచిన బట్లర్‌

CSK vs RR: దూకుడు పెంచిన బట్లర్‌

అబుదాబి: చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్దేశించిన 126 పరుగుల లక్ష్య ఛేదనలో  రాజస్థాన్‌ రాయల్స్‌ తడబడుతోంది. చెన్నై బౌలర్ల దెబ్బకు పవర్‌ప్లే ఆఖరికి రాజస్థాన్‌ 31/3తో నిలిచింది. పవర్‌ప్లేలో  చెన్నై సారథి ధోనీ...  దీపక్‌ చాహర్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌ వీళ్లిద్దరితోనే    బౌలింగ్‌   వేయించాడు. మహీ అంచనాలకు అనుగుణంగానే బౌలర్లు రాజస్థాన్‌ టాపార్డర్‌ను పడగొట్టేశారు.  బెన్‌స్టోక్స్‌, సంజు శాంసన్‌లను దీపక్‌  పెవిలియన్‌ పంపగా.. ఊతప్పను హేజిల్‌వుడ్‌ ఔట్‌ చేశాడు.  ముగ్గురు కీలక బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌ చేసిన చెన్నై రేసులోకి వచ్చింది. 

సాధించాల్సిన రన్‌రేట్‌ తక్కువగా ఉండటంతో రాజస్థాన్‌ స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేస్తోంది. 10 ఓవర్లకు రాజస్థాన్‌ 3 వికెట్లకు 59 పరుగులు చేసింది. ప్రస్తుతం స్టీవ్‌ స్మిత్‌(7), జోస్‌ బట్లర్‌(23) క్రీజులో ఉన్నారు. ఈ జోడీ నిలకడగా రాణిస్తూ భాగస్వామ్యాన్ని నెలకొల్పుతున్నది. బట్లర్‌దూకుడుగా ఆడుతుండగా స్మిత్‌ సహకారం అందిస్తున్నాడు.   రాజస్థాన్‌ విజయానికి ఇంకా 60 బంతుల్లో 67 పరుగులు చేయాల్సి ఉంది.