లిస్బన్: ప్రతిష్టాత్మక చాంపియన్స్ లీగ్ టైటిల్‌ను రెండోసారి గెలుచుకుంది చెల్సీ టీమ్. శనివారం రాత్రి జరిగిన ఫైనల్లో మాంచెస్టర్ సిటీపై 1-0తో ఆ టీమ్ విజయం సాధించింది. ఫస్ట్ హాఫ్‌లో కాయ్ హావెర్ట్ గోల్‌తో చెల్సీ లీడ్‌లోకి దూసుకెళ్లింది. మ్యాచ్ 42వ నిమిషంలో ఈ గోల్ నమోదైంది. సెకండాఫ్‌లో స్కోరు సమం చేయడానికి మాంచెస్టర్ సిటీ టీమ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇంగ్లిష్ ప్రిమియర్ లీగ్ చాంపియన్స్ అయిన సిటీ టీమే ఫైనల్లో ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. సిటీ టీమ్‌కు గత నాలుగు ప్రిమియర్ లీగ్ టైటిల్స్‌లో మూడు గెలిపించిన కోచ్ గార్డియోలా.. చాంపియన్స్ లీగ్‌ను మాత్రం అందించలేకపోయాడు.