మొనాకో: ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ మొనాకో గ్రాండ్ ప్రిలో పోల్ పొజిషన్ సాధించాడు. ప్రధాన రేసుకు ముందు శనివారం జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్లో లెక్లెర్క్ కారు ప్రమాదానికి గురైనా.. చివరికి అతడు మిగిలిన డ్రైవర్ల కంటే 18 సెకండ్ల ముందు లక్ష్యాన్ని చేరాడు. రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెస్టాపెన్ రెండో స్థానంలో నిలిచాడు. ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.