మంగళవారం 02 మార్చి 2021
Sports - Jan 28, 2021 , 12:28:51

క్రికెట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్‌పై ఛార్జిషీట్‌

క్రికెట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్‌పై ఛార్జిషీట్‌

వార‌ణాసి: ఇండియ‌న్ క్రికెట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ చిక్కుల్లో ప‌డ్డాడు. గురువారం అత‌నిపై వారణాసి కోర్టులో ఛార్జిషీట్ దాఖ‌లైంది. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని బ‌ర్డ్ ఫ్లూ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఉల్లంఘించాడ‌న్న అభియోగాల‌ను అత‌నిపై మోపారు. గంగా న‌దిలో ప‌డ‌వ‌పై వెళ్తూ.. ప‌క్షుల‌కు తినిపించాడు. ఈ సంద‌ర్భంగా తీసిన ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నాడు. ఇదే అత‌న్ని చిక్కుల్లోకి నెట్టింది. ఇది బ‌ర్డ్ ఫ్లూ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించ‌డ‌మే అవుతుందంటూ అడ్వొకేట్ సిద్ధార్థ్ శ్రీవాస్త‌వ వార‌ణాసి కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై కోర్టు ఫిబ్ర‌వ‌రి 6న విచార‌ణ జ‌ర‌ప‌నుంది. అయితే కేవ‌లం ఆ ప‌డ‌వ న‌డిపిన వ్య‌క్తిపై మాత్రమే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, ధావ‌న్‌పై ఎలాంటి చ‌ర్య‌లు ఉండ‌బోవ‌ని ఈ మ‌ధ్యే వార‌ణాసి జిల్లా మెజిస్ట్రేట్ కౌష‌ల్ రాజ్ శ‌ర్మ చెప్పారు. 

VIDEOS

logo