మంగళవారం 04 ఆగస్టు 2020
Sports - Jul 05, 2020 , 20:23:26

ఇండియన్‌ క్రికెట్‌ సంస్కృతిలో మార్పు: సౌరవ్‌ గంగూలీ

ఇండియన్‌ క్రికెట్‌ సంస్కృతిలో మార్పు: సౌరవ్‌ గంగూలీ

న్యూ ఢిల్లీ: ఇండియన్‌ క్రికెట్‌ సంస్కృతిలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అభిప్రాయపడ్డాడు. బౌలర్లు తాము అత్యంత వేగంగా బౌల్‌ చేయగలమనే ధీమాతో ఉంటున్నారని పేర్కొన్నాడు.  మహ్మద్ షమీ, జస్పీత్‌ బూమ్రా, ఇశాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌లాంటి పేసర్లతో భారత్‌ పేస్‌ బౌలింగ్‌ అటాక్‌ ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉందని కితాబిచ్చాడు. కొన్ని సందర్భాల్లో ఈ బౌలర్సే మ్యాచ్‌లను గెలిపించారని గుర్తుచేశాడు. 

‘అందరూ కలిసి స్ఫూర్తిని చాటుతున్నారు. కోచ్‌లు, ఫిట్‌నెస్‌ ట్రైనర్లు ఈ మార్పును తీసుకువచ్చారు. క్రికెట్‌ సంస్కృతిలోనే మార్పు వచ్చింది. బౌలర్లు తమ సత్తాను గుర్తించగలుగుతున్నారు. అత్యంత వేగంగా తాము బౌలింగ్‌ వేయగలమనే ధీమాను ప్రదర్శిస్తున్నారు.’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు. ఈ విషయాలను టీమిండియా ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ మయాంక్‌ అగర్వాల్‌తో షేర్‌ చేసుకుంటున్న వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో పెట్టింది. అంతకుముందు, పేసర్ మహమ్మద్ షమీ కూడా ప్రస్తుత భారత పేస్ దాడి క్రికెట్ చరిత్రలోనే ఉత్తమంగా ఉంటుందని చెప్పాడు. ఏ జట్టులోనూ ఐదుగురు ఫాస్ట్‌ బౌలర్లు లేరని, ఇప్పుడే కాదు.. ప్రపంచ చరిత్రలోనే ఇది అత్యుత్తుమ ఫాస్ట్‌బౌలింగ్‌ జట్టని అందరూ అంగీకరిస్తారని షమీ అభిప్రాయపడ్డాడు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo