బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Mar 27, 2020 , 00:04:33

చంద్రకుమార్‌ ఉత్తర్వులు చెల్లవు

చంద్రకుమార్‌ ఉత్తర్వులు చెల్లవు

  • జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం ఉపాధ్యక్షుడు జగన్మోహన్‌ రావు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: తెలంగాణ ఒలింపిక్‌ సంఘం(టీవోఏ) అధ్యక్షుడిగా కె.రంగారావును ప్రకటిస్తూ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి చంద్రకుమార్‌ ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం ఉపాధ్యక్షుడు ఏ.జగన్మోహన్‌ రావు అన్నారు. గత నెల ఫలితాల ప్రకటనతోనే చంద్రకుమార్‌ అధికారాలు ముగిశాయని గురువారం చెప్పారు. నిబంధనల ప్రకారం ఎన్నికల్లో గెలిచిన రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ త్వరలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారని, దీన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. ఎన్నికల అధికారి ఉత్తర్వులతో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రంగారావుపై హైకోర్టులో పోరాడతామని జగన్మోహన్‌ రావు స్పష్టం చేశారు. 


logo
>>>>>>