ఆదివారం 24 జనవరి 2021
Sports - Nov 25, 2020 , 02:01:56

హైదరాబాద్‌ హ్యాండ్‌బాల్‌ చీఫ్‌గా చందర్‌రెడ్డి

హైదరాబాద్‌ హ్యాండ్‌బాల్‌ చీఫ్‌గా చందర్‌రెడ్డి

హైదరాబాద్‌, ఆట ప్రతినిధి: హైదరాబాద్‌ జిల్లా హ్యాండ్‌బాల్‌ సంఘం అధ్యక్షుడిగా సీహెచ్‌ ఉదయ్‌ చందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సంజీవరావు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. సోమవారం జిల్లా హ్యాండ్‌బాల్‌ సంఘం కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఏకగీవ్రంగా వారిని ఎన్నుకున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పవన్‌ కుమార్‌ పేర్కొన్నారు. వచ్చే నెల 6న జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు సమక్షంలో కార్యవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించనున్నారు. logo