బుధవారం 03 మార్చి 2021
Sports - Feb 22, 2021 , 00:49:57

చాంపియన్‌ మహబూబ్‌నగర్‌

చాంపియన్‌ మహబూబ్‌నగర్‌

సిద్దిపేట కలెక్టరేట్‌, ఫిబ్రవరి 21: వాలీబాల్‌ కోర్టులేని ఊరు ఉండదని.. చిన్నతనం నుంచే క్రీడల్లో రాణిస్తూ వస్తున్న ఆటగాళ్లు జాతీయ స్థాయిలో సత్తాచాటి తెలంగాణ పేరు నిలబెట్టాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. అంతర్‌ జిల్లా వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌ విజేతలకు ఆదివారం మంత్రి బహుమతులు అందజేశారు. పురుషుల విభాగంలో హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్లో మహబూబ్‌నగర్‌ విజయం సాధించగా.. రంగారెడ్డి, మెదక్‌ వరుసగా మూడో, నాలుగో స్థానాల్లో నిలిచాయి. మహిళల విభాగంలో నిజామాబాద్‌ను చిత్తు చేసిన నల్లగొండ టైటిల్‌ గెలుచుకుంది. ఆదివారం రాత్రి హోరాహోరీగా సాగిన పోటీలను వీక్షించిన హరీశ్‌ రావు అనంతరం క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాలీబాల్‌ సంఘం అధ్యక్షుడు గజ్జల రమేశ్‌బాబు, కార్యదర్శి హన్మంతరెడ్డి, కృష్ణప్రసాద్‌, వాలీబాల్‌ భారత మాజీ కెప్టెన్‌ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo