టోక్యో: ఒలింపిక్స్ జిమ్నాస్టిక్ చాంపియన్ సిమోన్ బైల్స్ టీమ్ ఈవెంట్ నుంచి తప్పుకుంది. వాల్ట్ సందర్భంగా ఆమె గాయపడటంతో మధ్యలోనే ఈవెంట్ వదిలి వెళ్లిపోయింది. ఆల్ టైమ్ గ్రేట్ జిమ్నాస్ట్‌లలో ఒకరుగా భావిస్తున్న ఈ 24 ఏళ్ల అమెరికన్ జిమ్నాస్ట్.. ఓ ట్రైనర్ సాయంతో ఫ్లోర్ నుంచి తప్పుకుంది. కొద్దిసేపటి తర్వాత కాలికి కట్టుతో ఆమె మళ్లీ వచ్చింది. టీమ్ మేట్స్‌ను హగ్ చేసుకొని కాంపిటిషన్ నుంచి తప్పుకుంది. వరుసగా మూడోసారి ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలవాలన్న అమెరికా ఆశలకు గట్టి దెబ్బ పడింది. ఇక ఈ కాంపిటిషన్లో ఆమె లేకుండానే అమెరికా టీమ్ పాల్గొనాల్సి ఉంటుంది.