మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 29, 2020 , 00:25:43

యాంగ్‌పై ఎనిమిదేండ్ల బ్యాన్‌

యాంగ్‌పై ఎనిమిదేండ్ల బ్యాన్‌

లుసానె: డోప్‌ శాంపిల్స్‌ ఇచ్చేందుకు నిరాకరించిన ఒలింపిక్‌ పసిడి పతక విజేతపై ఎనిమిదేండ్ల నిషేధం పడింది. చైనాకు చెందిన స్టార్‌ స్విమ్మర్‌, ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణాలు కైవసం చేసుకున్న 28 ఏండ్ల సున్‌ యాంగ్‌పై బ్యాన్‌ విధిస్తున్నట్లు కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిటరేషన్‌ ఫర్‌ స్పోర్ట్‌ (సీఏఎస్‌) శుక్రవారం స్పష్టం చేసింది. దీంతో అతడు టోక్యో ఒలింపిక్స్‌ (2020)లో పాల్గొనే అర్హత కోల్పోయాడు. 2018లో రక్త నమూనాలు ఇచ్చేందుకు సున్‌ యాంగ్‌ నిరాకరించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సీఏఎస్‌ పేర్కొంది. అయితే తానేమి తప్పు చేయలేదని.. ఈ అంశంపై న్యాయపోరాటానికి సిద్ధమని యాంగ్‌ తెలిపాడు. ‘ఈ అంశంపై అప్పీలు చేస్తా. నేనేమి తప్పు చేయలేదు’ అని యాంగ్‌ అన్నాడు. అతడు గతం (2014)లోనూ డోపింగ్‌ ఆరోపణలతో నిషేధం ఎదుర్కొన్నాడు.


logo
>>>>>>