గురువారం 04 మార్చి 2021
Sports - Feb 23, 2021 , 11:21:35

లంక టీమ్‌తో కుద‌ర‌ని డీల్‌.. కోచ్ ప‌ద‌వికి వాస్ రాజీనామా

లంక టీమ్‌తో కుద‌ర‌ని డీల్‌.. కోచ్ ప‌ద‌వికి వాస్ రాజీనామా

కొలంబో:  మూడు రోజుల కింద‌ట‌ శ‌్రీలంక బౌలింగ్ కోచ్‌గా నియ‌మితుడైన మాజీ పేస్ బౌల‌ర్ చమిందా వాస్‌.. అప్పుడే రాజీనామా చేసేశాడు. శ్రీలంక క్రికెట్ బోర్డుతో డ‌బ్బు విష‌యంలో డీల్ కుద‌ర‌క‌పోవ‌డంతో అత‌డు ఈ నిర్ణ‌యం తీసుకున్నాడు. స‌రిగ్గా శ్రీలంక టీమ్ వెస్టిండీస్ టూర్‌కు బ‌య‌లుదేరే ముందే వాస్ రాజీనామా చేయ‌డంపై లంక బోర్డు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంద‌రి ఆర్థిక ప‌రిస్థితులు త‌ల‌కిందులైన స‌మ‌యంలో వాస్ ఇలా చేయ‌డం స‌రికాద‌ని, అది కూడా టీమ్ బ‌య‌లుదేరే ముందే రాజీనామా చేయ‌డం ఏంట‌ని లంక బోర్డు అధికారి ప్ర‌శ్నించారు. 

ఈ మ‌ధ్య సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టూర్‌ల‌లో టీమ్ ప్ర‌ద‌ర్శ‌న మ‌రీ దారుణంగా ఉంటంతో అప్ప‌టి వ‌ర‌కూ బౌలింగ్ కోచ్‌గా ఉన్న డేవిడ్ స‌క‌ర్‌ను తొల‌గించి గ‌త వార‌మే ఆ బాధ్య‌త‌లు వాస్‌కు అప్ప‌గించింది లంక బోర్డు. సోమ‌వారం రాత్రి టీమ్‌తో క‌లిసి వాస్ వెస్టిండీస్‌కు వెళ్లాల్సింది. శ్రీలంక మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ పేస్‌బౌల‌ర్ అయిన వాస్‌.. టెస్టుల్లో 355, వన్డేల్లో 400 వికెట్లు తీశాడు. అలాంటి లెజెండ‌రీ బౌల‌ర్ ఇలా ఉన్న‌ట్లుండి రాజీనామా చేయ‌డంపై లంక బోర్డు ఆవేద‌న వ్య‌క్తం చేసింది. 

VIDEOS

logo