ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Oct 29, 2020 , 22:02:25

షేన్‌ వాట్సన్‌ ఔట్‌...

షేన్‌ వాట్సన్‌ ఔట్‌...

దుబాయ్‌:  కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్య ఛేదనలో  చెన్నై సూపర్‌ కింగ్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి వేసిన 8వ ఓవర్లో షేన్‌ వాట్సన్‌(14) ఔటయ్యాడు. మరో ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ దూకుడుగా ఆడుతున్నాడు. పవర్‌ప్లే ఆఖరికి చెన్నై 44/0తో మెరుగైన స్థితిలో నిలిచింది. బ్యాట్స్‌మెన్‌ ఆచితూచి ఆడుతుండటంతో సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోతున్నది.  ప్రస్తుతం గైక్వాడ్‌(35), అంబటి రాయుడు(4) క్రీజులో ఉన్నారు. 9 ఓవర్లకు చెన్నై వికెట్‌ నష్టానికి 58 పరుగులు చేసింది.