ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Oct 29, 2020 , 22:40:54

రుతురాజ్‌ ఒంటరి పోరాటం..ధోనీ బౌల్డ్‌

రుతురాజ్‌ ఒంటరి పోరాటం..ధోనీ బౌల్డ్‌

దుబాయ్‌: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయం దిశగా సాగుతోంది. 173 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ అర్ధసెంచరీ సాధించాడు. ఆరంభం నుంచి నిలకడగా ఆడుతూ 37 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అతనికిది రెండో అర్ధశతకం కావడం విశేషం.  కమిన్స్‌ వేసిన 14వ ఓవర్లో రాయుడు(38) ఔటవగా వరుణ్‌ వేసిన తర్వాతి ఓవర్లో మహేంద్ర సింగ్‌ ధోనీ(1)  బౌల్డ్‌ అయ్యాడు.

15 ఓవర్లకు చెన్నై  3 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది.  గైక్వాడ్‌(62) ఒంటరి పోరాటం చేస్తుండగా అతనికి జోడీగా శామ్‌ కరన్‌ క్రీజులోకి వచ్చాడు. చెన్నై విజయానికి ఇంకా 30 బంతుల్లో 52 పరుగులు చేయాల్సి ఉంది.