బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Feb 08, 2020 , 07:23:47

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌.. షమీకి విశ్రాంతి

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌.. షమీకి విశ్రాంతి

కీలకమైన టెస్టు సిరీస్‌ జరగనున్న నేపథ్యంలో సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీకి విశ్రాంతినిస్తున్నట్లు విరాట్‌ చెప్పాడు.

ఆక్లాండ్‌ : ఆతిథ్య న్యూజిలాండ్‌తో టీమ్‌ఇండియా మరో కీలక సమరానికి సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కివీస్‌తో రెండో వన్డేలో భారత్‌ తలపడుతోంది. సిరీస్‌లో సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. త్వరలో కీలకమైన టెస్టు సిరీస్‌ జరగనున్న నేపథ్యంలో సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీకి విశ్రాంతినిస్తున్నట్లు విరాట్‌ చెప్పాడు.  షమీ స్థానంలో యువ పేసర్‌ నవదీప్‌ సైనీని  ఎంపిక చేయగా..చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ స్థానంలో స్పిన్నర్‌ చాహల్‌ను తుది జట్టులోకి తీసుకున్నాడు.  రెండోసారి బ్యాటింగ్‌  చేసే జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉండటంతో లక్ష్య ఛేదనవైపే కోహ్లీ మొగ్గు చూపాడు. ఈడెన్‌ పార్క్‌ మైదానం బ్యాటింగ్‌కు సహకరించనుంది. 

భారత్‌

పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్‌, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), శ్రేయాస్‌ అయ్యర్‌, కేఎల్‌రాహుల్‌(వికెట్‌ కీపర్‌), కేదార్‌ జాదవ్‌, జడేజా, శార్దుల్‌ ఠాకూర్‌, నవదీప్‌ సైనీ, చాహల్‌, బుమ్రా


న్యూజిలాండ్‌

మార్టిన్‌ గప్తిల్‌, హెన్రీ నికోల్స్‌, టామ్‌ బ్లండెల్‌, రాస్‌ టేలర్‌, టామ్‌ లాథమ్‌, మార్క్‌ చాపమన్‌, జేమ్స్‌ నీషమ్‌, గ్రాండ్‌హోం, టిమ్‌ సౌథీ, జెమీసన్‌, బెనెట్‌



logo
>>>>>>