శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Feb 08, 2020 , 09:12:00

NZvIND: గప్తిల్‌ హాఫ్‌సెంచరీ

NZvIND: గప్తిల్‌ హాఫ్‌సెంచరీ

భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్‌కు శుభారంభం లభించింది.

ఆక్లాండ్‌:  భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు మార్టిన్‌ గప్తిల్‌, హెన్రీ నికోల్స్‌(41) భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు.  స్టార్‌ హిట్టర్‌ గప్తిల్‌కు ఈ మైదానంలో మంచి రికార్డు ఉంది. బుమ్రా వేసిన 8వ ఓవర్లో రెండు ఫోర్లు, సిక్సర్‌ బాదిన గప్తిల్‌ ఏకంగా 15 పరుగులు రాబట్టాడు.  హెన్రీ  నిదానంగా ఆడుతూ గప్తిల్‌కు సహకారం అందించాడు.  నిలకడగా ఆడుతూ భారీ భాగస్వామ్యం దిశగా దూసుకెళ్తున్న జోడీని స్పిన్నర్‌ చాహల్‌ విడదీశాడు. 17వ ఓవర్‌ ఐదో బంతికి హెన్రీ నికోల్స్‌ ఎల్బీడబ్లూగా వెనుదిరిగాడు.   తొలి వికెట్‌కు ఓపెనర్లు 93 పరుగులు జోడించారు. బ్యాటింగ్‌కు సహకరిస్తున్న ఈడెన్‌ పార్క్‌లో కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ రెచ్చిపోయి బ్యాటింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గప్తిల్‌ 49 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. గప్తిల్‌(65), బ్లండెల్‌(12) క్రీజులో ఉన్నారు. 22 ఓవర్లు ముగిసేసరికి కివీస్‌ వికెట్‌ నష్టానికి 123 పరుగులు చేసింది. logo