గురువారం 03 డిసెంబర్ 2020
Sports - Oct 17, 2020 , 16:17:45

RR vs RCB: వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్‌

RR vs RCB: వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్‌

దుబాయ్: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఆరంభంలో వేగంగా ఆడింది.    సీజన్‌లో తొలిసారి ఓపెనర్‌గా బరిలో దిగిన రాబిన్‌ ఉతప్ప(41) వీరవిహారం చేశాడు. . బెంగళూరు బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ పరుగులు సాధించాడు.  ఉతప్ప మెరుపులతో పవర్‌ప్లేలో రాజస్థాన్‌ 52 రన్స్‌ రాబట్టింది. 

 క్రిస్‌ మోరీస్‌ వేసిన ఆరో ఓవర్లో బెన్‌స్టోక్స్(15)‌...డివిలియర్స్‌ చేతికి చిక్కాడు.  చాహల్‌ వేసిన ఎనిమిదో ఓవర్లో రాజస్థాన్‌ వరుసగా రెండు వికెట్లు చేజార్చుకుంది. ఓవర్‌ నాలుగో బంతికి భారీ షాట్‌ ఆడిన ఉతప్ప.. డీప్‌మిడ్‌వికెట్‌లో ఫించ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఐదో బంతికి  సంజు శాంసన్‌(9)..క్రిస్‌ మోరీస్‌ చేతికి చిక్కాడు.    కీలక బ్యాట్స్‌మన్‌ శాంసన్‌ వెనుదిరగడంతో రాజస్థాన్‌పై ఒత్తిడి పెరిగింది.  8 ఓవర్లకు రాజస్థాన్‌ 3 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది.  ప్రస్తుతం జోస్‌ బట్లర్‌(0), స్టీవ్‌ స్మిత్‌(0) క్రీజులో ఉన్నారు.