గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Sep 02, 2020 , 00:48:29

క్రీడా విభాగాల పెంపు

క్రీడా విభాగాల పెంపు

న్యూఢిల్లీ: క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా రాణించిన ప్లేయర్లను గ్రూప్‌-సి స్థాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో నేరుగా నియమించేందుకు క్రీడా విభాగాలను పెంచింది. ఇందులో భాగంగా గతంలో ఉన్న 43 క్రీడా విభాగాలకు అదనంగా మరో 20 కలుపుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఎంపిక చేసిన క్రీడా విభాగాల్లో టగ్‌ ఆఫ్‌ వార్‌, మల్లకాంబ్‌తో పాటు  పారా స్పోర్ట్స్‌ను చేర్చింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల్లో మొత్తం క్రీడా విభాగాల సంఖ్య 63కు చేరుకుంది. ‘కేంద్ర ప్రభుత్వం నియమించే గ్రూపు-సీ స్థాయి ఉద్యోగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన ప్లేయర్లను నేరుగా నియమించవచ్చు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ 63 క్రీడా విభాగాల్లో ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించిన వారు గ్రూపు-సీ స్థాయి పోస్టులకు అర్హులు అవుతారు’ అని పేర్కొంది. సవరించిన క్రీడా జాబితాలో  బేస్‌బాల్‌, రగ్బీ, బాస్కెట్‌బాల్‌, టగ్‌ ఆఫ్‌ వార్‌, మల్లకాంబ్‌, పారా స్పోర్ట్స్‌ను కొత్తగా చేర్చారు. 


logo