బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Feb 01, 2020 , 23:36:26

క్రీడలకు రూ.2826 కోట్లు

క్రీడలకు రూ.2826 కోట్లు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో భాగంగా 2020-21 ఏడాదికి గాను క్రీడల కోసం రూ.2826.92 కోట్లు కేటాయించింది. శనివారం లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ క్రీడలకు చెప్పుకోదగ్గ కేటాయింపులు లేకుండానే సాగింది. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి రూ.50 కోట్లు ఆదనంగా కేటాయింపులు మినహా భారీ మార్పులేమి లేవు. మోదీ సర్కార్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘ఖేలో ఇండియా’కు మాత్రం రూ.890.42 కోట్లు కేటాయించింది. గతేడాదితో చూసుకుంటే ఇది రూ.312.42 కోట్లు అధికం. క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాల కేటాయింపులను రూ.111 కోట్ల నుంచి రూ.70 కోట్లకు తగ్గించారు.  ఇక జాతీయ క్రీడాభివృద్ధి నిధి కోసం రూ.50 కోట్లు కేటాయించారు. భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌)కు ఈసారి రూ.115 కోట్లు తగ్గించి రూ.500 కోట్లు ఇచ్చారు.


logo
>>>>>>