గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Jan 23, 2020 , 09:29:59

అజారుద్దీన్‌పై ఎఫ్ఐఆర్‌..

అజారుద్దీన్‌పై ఎఫ్ఐఆర్‌..

హైద‌రాబాద్‌:  టీమిండియా మాజీ కెప్టెన్‌,  హెచ్‌సీఏ అధ్య‌క్షుడు, మాజీ ఎంపీ మొహ‌మ్మ‌ద్ అజారుద్దీన్‌పై మ‌హారాష్ట్ర‌లోని ఔరంగ‌బాద్ పోలీస్ స్టేష‌న్‌లో ఎఫ్ఐఆర్ న‌మోదు అయ్యింది.  అజ‌ర్‌తో పాటు మ‌రో ఇద్ద‌రిపైన కూడా కేసు వేశారు.  ట్రావెల్ ఏజెంట్ మొహ‌మ్మ‌ద్ షాదాబ్‌ను సుమారు 20 ల‌క్ష‌ల వ‌ర‌కు మోసం చేసిన‌ట్లు ముగ్గురిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మ‌హారాష్ట్ర పోలీసులు దీనిపై విచార‌ణ చేప‌డుతున్నారు. అయితే ఆ వార్త‌లు అవాస్త‌మ‌ని అజ‌ర్ అన్నారు. ఓ వీడియో ద్వారా ఆయ‌న త‌న సందేశాన్ని వినిపించారు. త‌న లీగ‌ల్ టీమ్‌తో సంప్ర‌దించిన త‌ర్వాత నిర్ణ‌యం తీసుకుంటామ‌ని అజ‌ర్ అన్నారు.  ప‌రువు న‌ష్టం కేసును కూడా న‌మోదు చేయ‌నున్న‌ట్లు చెప్పారు.  ఔరంగబాద్‌కు చెందిన దానిష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ య‌జ‌మాని షాదాబ్‌.. ఈ ఫిర్యాదును న‌మోదు చేశారు.  అజ‌ర్‌తో పాటు ముజీబ్ ఖాన్‌(ఔరంగ‌బాద్‌), సుదేశ్ అవిక్క‌ల్‌(కేర‌ళ‌)పై కేసు న‌మోదు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి అరెస్టులు జ‌ర‌గ‌లేదు. 


logo
>>>>>>