సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Aug 20, 2020 , 00:40:56

జమైకా బోణీ

జమైకా బోణీ

తరోబా(ట్రినిడాడ్‌ అండ్‌ టుబాగో):  ఈ ఏడాది కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌)లో జమైకా తలావాస్‌ బోణీ కొట్టింది. బుధవారం సెయింట్‌ లూసియా జౌక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోమన్‌ పావెల్‌ నేతృత్వంలోని జమైకా ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. గ్లెన్‌ ఫిలిప్స్‌(44), ఆసిఫ్‌ అలీ(47) రాణించడంతో 159 పరుగుల లక్ష్యాన్ని ఏడు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. రొస్టన్‌ చేజ్‌(52) రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన డారీన్‌ సమీ నేతృత్వంలోని సెయింట్‌ లూసియా ఏడు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. కాగా మంగళవారం సీపీఎల్‌ ప్రారంభం కాగా తొలి మ్యాచ్‌లో  మ్యాచ్‌లో గయానా అమెజాన్‌ వారియర్స్‌పై ట్రినిడాడ్‌ నైట్‌ రైడర్స్‌, ఆ తర్వాత  సెయింట్‌ కిట్స్‌ జట్టుపై బార్బొడాస్‌ ట్రైడెంట్స్‌ విజయం సాధించాయి. 


తాజావార్తలు


logo