బుధవారం 12 ఆగస్టు 2020
Sports - Jul 13, 2020 , 15:55:57

కెప్టెన్సీ నా ఆటతీరుపై ప్రభావం చూపలేదు.. : బెన్ స్టోక్స్

కెప్టెన్సీ నా ఆటతీరుపై ప్రభావం చూపలేదు.. : బెన్ స్టోక్స్

సౌతాంప్టన్: కెప్టెన్సీ తన ఆటతీరుపై ప్రభావం చూప లేదని ఇంగ్లాడ్‌ జట్టు కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌ తెలిపారు. వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ తొలి టెస్టును కోల్పోయింది. తొలి టెస్టు చివరి రోజున వెస్టిండీస్ మొత్తం 200 పరుగులను ఛేదించింది, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య జట్టు పై 1-0 ఆధిక్యాన్ని సాధించింది. మ్యాచ్ అనంతరం పలువురు మాట్లాడుతూ, స్టోక్స్ రెండో ఇన్నింగ్స్‌లో ఒత్తిడికి గురయ్యాడని, కెప్టెన్సీనే ఇందుకు కారణమని వ్యాఖ్యానించారు. దీనిపై స్టోక్స్‌ వివరణ ఇచ్చారు.   

'జోరూట్‌ ఇంటికే పరిమితం కావడంతో నేను కెప్టెన్సీని ఎంజాయ్‌ చేశాను. కొంత కాలం క్రితం జట్టును నడిపించడం గురించి తెలుసుకున్నాను. అందువల్ల నేను అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను.' అని తొలి టెస్టు ముగిసిన అనంతరం స్టోక్స్ అన్నాడు. జట్టును నడిపించడం, మైదానంలో నిర్ణయాలు తీసుకోవడంలో నేను నిజంగా చాలా ఆనందించాను అని తెలిపాడు. కెప్టెన్సీ వల్ల తన ఆటతీరులో ఎలాంటి మార్పురాబోదని ధీమా వ్యక్తంచేశాడు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo