ముంబై: ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి, అనుష్క శర్మ జంటకు సంబంధించి ఏ ఫొటో అయినా, వార్త అయినా ఇంటర్నెట్లో వైరల్ అయిపోతుంది. ఈ సెలబ్రిటీ జోడీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మరి. వాళ్ల జీవితంలోని ఏ చిన్న సంఘటనను షేర్ చేసుకున్నా.. అది వారి అభిమానులకు పెద్ద వార్తే అవుతుంది. ఇప్పుడు వాళ్ల అభిమాని, క్రికెటర్ అయిన సంజయ్ పహల్.. విరుష్కతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటూ తన ముచ్చటను అందరితో పంచుకున్నాడు.
కానీ నెటిజన్లు మాత్రం ఈ ఫొటోలో తమకు కావాల్సింది వెతుక్కున్నారు. పై ఫొటోలో మీకు ఏమైనా ప్రత్యేకంగా కనిపిస్తోందా? కాస్త జాగ్రత్తగా గమనిస్తే కోహ్లి భుజంపై ఓ చిన్న టవల్లాంటిది కనిపిస్తుంది. దీనినే బర్ప్ క్లాత్ అంటారు. సాధారణంగా చిన్న పిల్లలను ఎత్తుకున్నప్పుడు దీనిని భుజంపై వేసుకుంటారు. ఈ మధ్యే విరాట్ తండ్రయిన విషయం తెలుసు కదా. ప్రస్తుతం కోహ్లి ఐపీఎల్లో భాగంగా అటూఇటూ తిరుగుతుండటంతో అతని వెంటే అనుష్క కూడా తమ కూతురు వామికతో వెళ్తోంది.
పాపను భుజంపై ఎత్తుకున్నప్పుడు వేసుకొనే ఆ క్లాత్‌తోనే కోహ్లి ఈ ఫొటోకు పోజిచ్చాడు. గతంలో అనుష్క కూడా ఈ బ్లర్ప్ క్లాత్‌తో ఓ ఫొటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం మా ఫేవరెట్ యాక్సెసరీ ఇదే అంటూ ఆమె అప్పుడు కామెంట్ చేసింది.