శనివారం 26 సెప్టెంబర్ 2020
Sports - Sep 06, 2020 , 17:19:56

రైనా విషయంలో ఏదైనా తప్పు జరిగితే ఎవరిది బాధ్యత?

 రైనా విషయంలో ఏదైనా తప్పు జరిగితే ఎవరిది బాధ్యత?

ముంబై: రాబోయే ఐపీఎల్‌ 13వ సీజన్‌లో పాల్గొనేందుకు  సీనియర్‌ ఆటగాడు సురేశ్‌ రైనా మళ్లీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ క్యాంప్‌లో చేరతాడా లేదా అనేదానిపై బీసీసీఐ వద్ద ఎలాంటి సమాచారం లేదని బోర్డు అధికారి ఒకరు చెప్పారు.  

'అతడు చెన్నై క్యాంప్‌ నుంచి అర్థంతరంగా తప్పుకోవడానికి గల కారణాలేంటో బీసీసీఐ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇది అతని కుటుంబం కోసం అయితే అది అతని వ్యక్తిగత కారణం. మహేంద్రసింగ్‌ ధోనీతొ విభేదాలు అయితే చెన్నై టీమ్‌ అంతర్గత సమస్య.  అతడు డిప్రెషన్‌ కారణంగా తిరిగి వస్తే, అది మానసిక సమస్య. ఒకవేళ అతడు తీవ్ర నిరాశకు గురైనట్లైతే మేము అతన్ని వెళ్లనివ్వం. ఏదైనా తప్పు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు?' అని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. 

రైనా కౌన్సెలింగ్‌ తీసుకుంటున్నాడో లేదో కూడా బోర్డుకు తెలియదు. ప్రస్తుత కాలంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు  మానసిక నిపుణులను సంప్రదించాల్సిన అవసరం ఉన్నది. అప్పటి వరకు బీసీసీఐ అతడిని తిరిగి వెళ్లడానికి అనుమతించే  అవకాశమే లేదు.  


logo