ఆదివారం 29 మార్చి 2020
Sports - Feb 04, 2020 , 04:04:40

పునరాగమనం అంత సులువుకాదు: కపిల్‌దేవ్‌

 పునరాగమనం అంత సులువుకాదు: కపిల్‌దేవ్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌కు ఎక్కువ కాలం దూరమైతే.. తిరిగి పునరాగమనం చేయడం అంత సులువుకాబోదని భారత క్రికెట్‌ దిగ్గజం కపిల్‌ దేవ్‌ అభిప్రాయపడ్డాడు. అయితే ధోనీకి ఐపీఎల్‌ రూపంలో మరో అవకాశం ఉందని హర్యానా హారికేన్‌ పేర్కొన్నాడు. ‘ఎక్కువ కాలం క్రికెట్‌కు దూరమైతే, తిరిగి మైదానంలో దిగడం చా లా కష్టం. కానీ, ధోనీకి ఐపీఎల్‌ ఉంది. ఈ సీజన్‌ అతడికి కీలకం. టీమ్‌ఇండియా సెలెక్టర్లు అ త్యుత్తమ జట్టునే ఎంపిక చే యాలి. ధోనీ దేశానికి ఎన్నో ట్రో ఫీలు అందించాడు. అయితే 6-7 నెలలు ఆటకు దూరమై భవితవ్యంపై అందరిలోనూ సందేహాలు రేకెత్తించాడు. దీనివల్ల అనవసర చర్చలు సాగుతున్నాయి’అని కపిల్‌దేవ్‌ అన్నాడు. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌ అనంతరం ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
logo