బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Oct 29, 2020 , 17:20:54

IPL 2020: చెన్నైతో కోల్‌కతా 'ఢీ'

IPL 2020: చెన్నైతో కోల్‌కతా 'ఢీ'

దుబాయ్:‌ ఐపీఎల్‌-13 ప్లేఆఫ్‌ రేసు రసవత్తరంగా సాగుతోంది.  ఇయాన్‌ మోర్గాన్‌ సారథ్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌, మహేంద్ర సింగ్‌ ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ప్లేఆఫ్‌ బెర్తు అవకాశాలను మరింత మెరుగుపరచుకోవాలని కోల్‌కతా భావిస్తోంది. 

మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే  16 పాయింట్లతో  కోల్‌కతా ప్లేఆఫ్‌ రేసులో ఉంటుంది.  టాప్‌-4లో చోటు దక్కాలంటే నెట్‌రన్‌రేట్‌ కూడా కీలకంగా మారింది. రెండింటిలో ఒక మ్యాచ్‌ గెలిచినా కోల్‌కతా ప్లేఆఫ్‌ చేరే అవకాశం ఉంది. కానీ, మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. 

ఇప్పటికే  ప్లేఆఫ్‌ నుంచి నిష్క్రమించిన చెన్నైపై భారీ విజయాన్ని సాధించాలని కోల్‌కతా భావిస్తోంది.  గత మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు చెన్నై షాకిచ్చింది. అదే జోరులో కోల్‌కతాపై గెలవాలని ధోనీసేన పట్టుదలతో ఉంది.  ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో కోల్‌కతా పాయింట్ల పట్టికలో ఐదోస్థానంలో ఉంది. చెన్నై 4  విజయాలతో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది.