శనివారం 23 జనవరి 2021
Sports - Dec 04, 2020 , 00:25:42

మహిళలకు క్యాంపస్‌ క్రికెట్‌ టోర్నీ

మహిళలకు క్యాంపస్‌ క్రికెట్‌ టోర్నీ

  • స్టార్‌ క్రికెటర్‌ మంధాన మద్దతు 

ముంబై: రెడ్‌బుల్‌ క్యాంపస్‌ క్రికెట్‌ తొలిసారిగా నిర్వహిస్తున్న మహిళల టోర్నీకి టీమ్‌ఇండియా స్టార్‌ ప్లేయర్‌ స్మృతి మంధాన మద్దతు తెలిపింది. దేశంలో మహిళల క్రికెట్‌కు ఆదరణ పెరిగేందుకు ఈ టోర్నీ ఎంతో ఉపకరిస్తుందని గురువారం అభిప్రాయపడింది. నార్త్‌, సౌత్‌, ఈస్ట్‌, వెస్ట్‌ జోన్లవారీగా ఈ టోర్నీ వచ్చే ఏడాది జరుగనుంది. జోనల్‌ పోటీల్లో గెలిచిన జట్లు నేషనల్‌ ఫైనల్స్‌లో ఆడుతాయి. ‘రెడ్‌బుల్‌ క్యాంపస్‌ క్రికెట్‌ వచ్చే ఏడాది మహిళల ఎడిషన్‌ను నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రొఫెషనల్‌ క్రికెటర్లుగా ఎదగాలనుకుంటున్న మహిళలకు ఇదో గొప్ప వేదిక అవుతుంది. రెడ్‌బుల్‌ క్యాంపస్‌ క్రికెట్‌ ఆడిన కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, కరుణ్‌ నాయర్‌ సహా మరికొందరు జాతీయ, రాష్ర్టాల జట్లకు ఎంపికయ్యారు. వచ్చే ఏడాది మహిళలకు కూడా క్యాంపస్‌ క్రికెట్‌ నిర్వహిస్తుండడం దేశ క్రికెట్‌కు  శుభపరిణామం’ అని స్మృతి ట్వీట్‌ చేసింది.


logo