Sports
- Feb 03, 2021 , 15:44:45
VIDEOS
ఐపీఎల్ ఆడేందుకు ఆసీస్ ఆటగాళ్లకు గ్రీన్‌సిగ్నల్

సిడ్నీ: రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2021 సీజన్లో పాల్గొనేందుకు తమ ఆటగాళ్లను అనుమతిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తాత్కాలిక సీఈవో నిక్ హాక్లీ బుధవారం ధ్రువీకరించారు. వ్యక్తిగత ప్రాతిపదికన ఐపీఎల్లో ఆడే ఆటగాళ్లకు బోర్డు నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) మంజూరు చేస్తుందని హాక్లీ వెల్లడించారు. సౌతాఫ్రికాలో కొవిడ్-19 వ్యాప్తి కారణంగా ఆదేశ పర్యటనను ఆసీస్ వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే.
గతేడాది సెప్టెంబర్-నవంబర్‌లో యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్లో 19 మంది ఆస్ట్రేలియా క్రికెటర్లు పాల్గొన్నారు. రాబోయే ఐపీఎల్-14వ సీజన్ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి భారత్‌లో జరగనుంది. ఆటగాళ్లకు గాయాల సమస్యలు ఉంటే తప్ప, ఎన్వోసీలు మంజూరు చేయడంలో ఎటువంటి సమస్య ఉండదు.
తాజావార్తలు
MOST READ
TRENDING